టీవీ ఇంటర్వ్యూలో ఐఐటీ బాబాపై దాడి.. అసలు ఏమైందంటే..

టీవీ ఇంటర్వ్యూలో ఐఐటీ బాబాపై దాడి.. అసలు ఏమైందంటే..

ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త‌, ఐఐటీ బాబా(IIT Baba)గా పాపులర్ అయిన అభయ్ సింగ్‌(Abhay Singh)పై టీవీ ఇంటర్వ్యూలో దాడి జరగడం సంచలనంగా మారింది. కుంభమేళా వేదికగా ప్రాచుర్యం పొందిన అభయ్ సింగ్, శుక్రవారం నోయిడా(Noida)లోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

దాడికి సంబంధించిన వివరాలు
ఇంటర్వ్యూ మధ్యలో కాషాయ దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు న్యూస్‌రూమ్‌లోకి ప్రవేశించి, ఐఐటీ బాబాతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆయనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. వెంటనే అభయ్ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్‌పోస్ట్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.

ఐఐటీ నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం వరకు..
హరియాణాకు చెందిన అభయ్ సింగ్, ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం కార్పొరేట్ రంగంలో పనిచేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని కుంభమేళాలో పాల్గొనడంతో ఆయన పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment