టీమిండియా తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆస్ట్రేలియా(INDvsAUS)పై ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు ఆసిస్ ఆటగాళ్లను మట్టికరిపించారు.
265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ విధ్వంసకర ఇన్నింగ్ ఆడింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఆసిస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా టీమిండియా ఆస్ట్రేలియాపై సునాయాస విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా – న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీఫైనల్-2లో విజయం సాధించిన జట్టుతో మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.