---Advertisement---

Ind vs Aus : నేడు కంగారూల‌తో కీల‌క స‌మ‌రం

నేడు కంగారూల‌తో కీల‌క స‌మ‌రం
---Advertisement---

ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీలో నేడు కీల‌క స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. దుబాయ్ వేదిక‌గా భారత్- ఆస్ట్రేలియా(India Vs Australia) జట్లు త‌ల‌బ‌డ‌నున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. భారత్ తన గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లను గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. టీమిండియా-ఆసిస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే కీల‌క మ్యాచ్ అభిమానుల్లో ఆస‌క్తిని రేపుతోంది. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఎలాగైనా కంగారూల‌పై గెల‌వాల‌ని టీమిండియా ఫ్యాన్స్(Cricket Fans) ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజలు చేస్తున్నారు.

ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల‌లో టీమిండియాదే పైచేయిగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో నాలుగు సార్లు తలపడగా, భారత్ రెండు సార్లు, ఆస్ట్రేలియా ఒకసారి గెలిచాయి, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ జట్టు 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఎదుర్కొన్న ఓటమికి ప్రతీకారం(Cricket Rivalry) తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment