‘నేనూ బొమ్మ‌లో ఫ్రీగా సినిమాలు చూశా’.. – సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

'నేనూ బొమ్మ‌లో ఫ్రీగా సినిమాలు చూశా'.. - సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఐబొమ్మ వ్యవహారంపై దేశవ్యాప్తంగా (Nationwide) చర్చ కొనసాగుతున్న సమయంలో, సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సినీ రంగంలో సంచలనం రేపాయి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ, “నేనూ ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా (Free) చూశాను. థియేట‌ర్‌లోకి వెళ్లి ఆరేడు వందల రూపాయ‌లు పెట్టి ఎలా చూసేదెలా అని చూశా” అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్‌ అందరినీ ఆకట్టుకుంది. రవి (Ravi) వంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడానికి కారణం ప్రస్తుత వ్యవస్థలేనని ఆయన స్పష్టంచేశారు.

వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయకపోతే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వస్తాయని నారాయణ అభిప్రాయపడ్డారు. “అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం కూడా ఈ సమస్యలే. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారు. ఒక హిడ్మా (Hidma)ను చంపితే వెయ్యి మంది హిడ్మాలు (Hidmas) పుడతారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రం రవికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. యువత, సినీ ప్రేక్షకులు, మీమ్ క్రియేటర్లు (Meme Creators), రీల్స్ క్రియేటర్లు (Reels Creators) అతనికి సపోర్ట్‌గా ముందుకు వస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. “ఐబొమ్మ వాడని వారు లేరు” అంటూ అనేక మంది కామెంట్లు చేస్తుండగా, నారాయణ లాంటి జాతీయ నాయకుడు రవికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం మరింత హీట్ క్రియేట్ చేస్తోంది.

సీపీఐ నాయకుడి ఈ వ్యాఖ్యల తర్వాత సినిమా ఇండస్ట్రీ (Film Industry) ఎలా రెస్పాండ్ చేస్తుందన్న ఆసక్తి పెరిగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేటర్ యజమానులు ఈ విషయంపై ఏ విధమైన ప్రతిస్పందన ఇస్తారో వేచి చూడాలి. ఇప్పటికే ఐబొమ్మపై చర్చ దేశవ్యాప్తంగా సాగుతుండగా, నారాయణ వంటి నేత చేసిన సంచలన వ్యాఖ్యలు మొత్తం విషయాన్ని మరింత వేడెక్కించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment