ఐబొమ్మ ర‌వి కేసు.. వెలుగు చూస్తున్న సంచ‌ల‌నాలు

ఐబొమ్మ రవి కేసు హాట్ టాపిక్!

ఐబొమ్మ రవి కేసు (Ibomma Ravi Case) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలు ప్రజలను షాక్‌కు గురి చేస్తున్నాయి. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే సుమారు రూ.13 కోట్ల అక్రమ ఆదాయం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్టు వెల్లడైంది. హైఫై పబ్‌లు, 5 స్టార్ హోటళ్లలో బస చేస్తూ లగ్జరీ లైఫ్ గడిపిన రవికి సంబంధించిన అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం 2007 నుంచే రవికి పైరసీపై ఆసక్తి ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే తన స్నేహితులైన ప్రహ్లాద్ (Prahlad), అంజయ్య (Anjaiah), కాళీ ప్రసాద్‌ (Kali Prasad)ల ఐడెంటిటీ ప్రూఫ్‌లను వారికి తెలియకుండానే చోరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లు తెరవడమే కాకుండా అక్రమ కార్యకలాపాలకు వినియోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ఫేక్ డాక్యుమెంట్ల (Fake Documents) ఆధారంగానే Supplier India, Hospital Inn, ER Infotech పేర్లతో మూడు కంపెనీలను స్థాపించినట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రామగుండంకు చెందిన అంజయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. విచారణలో భాగంగా టెలిగ్రామ్ నుంచి ‘తండెల్’, ‘కిష్కిందపురి’ వంటి సినిమాలను డౌన్‌లోడ్ చేసినట్టు రవి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరిన్ని పెద్ద పేర్లు బయటపడే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తుండటంతో, ఐబొమ్మ రవి కేసు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment