‘ప‌వ‌న్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాదు’.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సెటైర్లు

'ప‌వ‌న్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాదు'.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సెటైర్లు

కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), జనసేన పార్టీ (JanaSena Party) అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై సెటైర్లు (Satires) పేల్చారు. ఇటీవ‌ల ఇక ఇంగ్లిష్ పాడ్‌క్యాస్ట్ ఇంట‌ర్వ్యూకు అటెండ్ అయిన క‌విత‌.. యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ (Serious) రాజకీయ నాయకుడు (Political Leader) కాదని ఆమె చెప్పారు. హిందీని ప్రజలు తప్పక నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “దురదృష్టవశాత్తూ (Unfortunately) ఆయన డిప్యూటీ సీఎం (Deputy CM) అయ్యారు. ఒకప్పుడు చేగువేరా సిద్ధాంతాలతో ముందుకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎలా రైట్‌వింగ్ భావజాలం వైపు మళ్లారు?” అని ప్రశ్నించారు.

ఆయన మాటలు స్థిరంగా ఉండవని, ఒక రోజు ఇలా చెబితే మరుసటి రోజు మరోలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. “రేపు తమిళనాడుకెళ్లి హిందీని తమపై రుద్దమని కూడా ఆయన అనవచ్చు. అనుకోకుండా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కానీ సీరియస్ రాజకీయవేత్త మాత్రం కాదు” అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఎమ్మెల్సీ క‌విత చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

బ్రహ్మానందంతో పోలిక‌
పవన్ కళ్యాణ్‌ను గ‌తంలో క‌మెడియన్ (Comedian) అని వ్యాఖ్యానించారు. సినిమా సీరియస్‌గా నడుస్తున్న టైంలో బ్రహ్మానందం (Brahmanandam) వచ్చి నవ్వించినట్టుగానే సీరియస్ పాలిటిక్స్‌ మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి నవ్విస్తుంటారని సెటైర్లు వేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment