సంచ‌ల‌నం.. మైనర్ బాలుడిపై యువతి లైంగికదాడి

సంచ‌ల‌నం.. మైనర్ బాలుడిపై యువతి లైంగికదాడి

హైద‌రాబాద్‌ (Hyderabad) లో సంచ‌ల‌న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక 28 ఏళ్ల యువతి (Young Woman), 16 ఏళ్ల మైనర్ బాలుడి (Minor Boy)పై పలుమార్లు లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడిన ఘ‌ట‌న బాలుడి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో బ‌య‌ట‌ప‌డింది. ఈ సంఘ‌ట‌న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో నివాసముండే యువతి, తన ఇంటి సమీపంలో నివసించే మైనర్ బాలుడితో పరిచయం పెంచుకుంది. అనంతరం అతన్ని తన ఇంటికి పిలిచి మాయమాటలతో లోబర్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె పలుసార్లు తన నివాసంలోనే బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఇంతటితో ఆగకుండా, ఈ విషయం ఎవరికైనా చెబితే బ‌ల‌వంతంగా నువ్వే నాపై అత్యాచారం చేశావంటూ పోలీసులకు చెబుతానని బెదిరిస్తూ బాలుడిని బెదిరించింది. ఆ యువ‌తి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిపోయిన బాలుడు.. ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. తాజాగా మ‌రోసారి బాలుడిపై లైంగిక దాడికి యువ‌తి య‌త్నించింది. బాలుడిని వదిలిపెట్టకుండా అసభ్యకరంగా ప్రవర్తించమంటూ బలవంతంగా ఒత్తిడి చేసింది.

చివరికి, యువతి వేధింపులు రోజురోజుకూ పెరగడంతో భరించలేక తల్లిదండ్రులకు (Parents) జరిగిన దారుణాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, బాధిత బాలుడి చెప్పిన మేరకు 28 ఏళ్ల యువతిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment