బంజారాహిల్స్ (Banjara Hills)లో ఒక యువకుడి కిడ్నాప్ కేసు (Kidnap Case) కలకలం రేపింది. పబ్(Pub)లో ఎంజాయ్ చేద్దామని పిలిచి, ఓ మహిళ తన భర్తతో కలిసి యువకుడిని కిడ్నాప్ (Kidnap) చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడి నగ్న వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరించారు.
ఓ ఆభరణాల షాపులో పనిచేసే ఆ యువకుడిపై ఈ దంపతులు భారీ స్కెచ్ వేశారు. అతడు చనిపోయాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పినట్లుగా సినీ ఫక్కీలో ఒక డ్రామా ఆడారు. బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు బార్ డ్యాన్సర్, ఆమె భర్తతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.