హైదరాబాద్‌లో న్యూఇయర్ సంబరాల సందర్భంగా పెద్ద మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఈస్ట్ జోన్‌లో 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192 కేసులు, వెస్ట్ జోన్‌లో 179 కేసులు, నార్త్ జోన్‌లో 177 కేసులు, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. న్యూఇయర్ సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. ప్రమాదాల నివారణకు నగరంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు.