హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. పోలీసుల త‌నిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ఎండీఎంఏ (మోలీ)ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.1.60 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేశారు.

ఈ ఘటనలో ముగ్గురు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో, అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌పై కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. నిందితులు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి, హైదరాబాద్‌లోని విద్యార్థులు, యువతకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment