మరికాసేపట్లో అతిభారీ వర్షం!

మరికాసేపట్లో అతిభారీ వర్షం!

హైదరాబాద్‌ (Hyderabad) నగరానికి వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ (Heavy) నుంచి అతిభారీ వర్షం (Very Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ముఖ్యంగా ఆఫీసులు, ఇతర పనులు ముగిసే వేళలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు, తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు కూడా జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment