---Advertisement---

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
---Advertisement---

హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై దారుణ ఘ‌ట‌న‌ జ‌రిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్ట‌ల్‌లోకి చొర‌బ‌డిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న స‌మ‌యంలో ఆ యువ‌తి గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న విద్యార్థులు వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన వివరాలు
ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. విద్యార్థిని, మంగల్‌పల్లి గేట్ వద్ద ఒక ప్రైవేట్ హాస్ట‌ల్‌లో ఉంటోంది. బుధవారం రాత్రి, వసతిగృహంపై అంతస్తులో జరిగిన జన్మదిన వేడుకల్లో యువకుడు అజిత్ (22) అతిథిగా వచ్చి, విద్యార్థిని గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

పక్క గది విద్యార్థుల ధైర్యం
విద్యార్థిని కేకలు వినిపించడంతో, పక్క గదిలో ఉన్న నలుగురు విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అజిత్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు. అజిత్ గతంలో హాస్ట‌ల్ యజమాని వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసాడని, హాస్ట‌ల్‌లో కూడా ఉండేవాడని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment