దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై డాన్స్

దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై డాన్స్

హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోని కుషాయిగూడ (Kushaiguda) లో మానవత్వాన్ని మరిచిన‌ దారుణ ఘటన వెలుగుచూసింది. కమలాదేవి (Kamaladevi) అనే 70 ఏళ్ల వృద్ధురాలిని (Elderly Woman) ఒక యువకుడు ఉరివేసి (Hanged) హత్య (Murder) చేసి, ఆమె మృతదేహం (Dead Body)పై డాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియోలు (Selfie Videos) తీసిన అమాన‌వీయ‌ ఘటన స్థానికులను, పోలీసులను షాక్‌కు గురిచేసింది.

అద్దె వివాదం – హత్యకు దారి
వివరాల్లోకి వెళితే.. కమలాదేవి తనకు చెందిన షాపు భాగాన్ని ఓ యువకుడి (Young Man) కి అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. అద్దె చెల్లింపులో (Rent Payment) తలెత్తిన గొడవల నేపథ్యంలో ఆమె ఆ యువకుణ్ణి మందలించడంతో, అతడు ఆమెపై కోపంతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న వృద్ధురాలిని ఉరివేసి హత్య చేశాడు. హత్య అనంతరం కమలాదేవి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అంతటితో ఆగకుండా మృతదేహంపై డాన్స్ చేస్తూ తీసిన సెల్ఫీ వీడియోలను తన స్నేహితులకు (Friends) షేర్ చేశాడు. ఈ వీడియోలు బెంగళూరు (Bengaluru) లో వైరల్ కావడంతో పోలీసులు సమాచారం పొందారు.

మృతదేహం గుర్తించిన పోలీసులు
వీడియోల ఆధారంగా పోలీసులు కమలాదేవి ఇంటిని గుర్తించి అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు కూడా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిగా భావిస్తున్న యువకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలతో పాటు నిందితుడి మిత్రుల జాబితాపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment