అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక‌య్యారు. క్రికెట‌ర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ఈ మెగా టోర్నీలో రెండోసారి ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) వారిని ఘ‌నంగా స‌న్మానించింది. శ‌నివారం ఉప్పల్ స్టేడియంలో యువ క్రికెటర్లను హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శన‌పల్లి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.

హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్ వంటి టోర్నీకి తెలంగాణ క్రికెటర్లు ఎంపిక కావడం గర్వకారణమ‌ని, వీరు ఈ స్థాయికి చేరుకోవడానికి వారి త‌ల్లిదండ్రులు, కోచ్‌లు చేసిన కృషి అంగీకరించదగ్గది అని అన్నారు. ఈ క్రికెటర్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని యువ‌ క్రికెట‌ర్లకు సూచించారు. జాతీయ జ‌ట్టులో మరింత మంది తెలంగాణ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించేందుకు హెచ్‌సీఏ కార్యవర్గం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ వరల్డ్‌కప్‌లో ఆడి వచ్చాక ఈ ఇద్దరికి నగదు బహుమతి ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, స‌హాయ కార్యదర్శి బ‌స‌వ‌రాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్, ఐసీఏ సభ్యురాలు వంకా రోమ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment