ప్రేమికుల జంట ఆత్మహత్యలతో తెలంగాణలో విషాదం నెలకొంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి హితవర్షిణి (20) తన జీవితాన్ని రైలు కింద ముగించుకోగా, ఆమె మరణ వార్త తెలిసిన ప్రియుడు వినయ్ బాబు (28) కూడా బావిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన హితవర్షిణి హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. సెలవులు ముగిసిన తర్వాత కళాశాల ప్రారంభం కావడంతో తిరిగి నగరానికి వచ్చిన ఆమె బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకుంది.
కాగా, హితవర్షిణి చివరిసారిగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబుతో ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రియురాలి మృతి వార్త తెలిసిన తర్వాత వినయ్ బాబు కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్‌లో “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా” అని రాసినట్టు పోలీసులు తెలిపారు.
పెద్దల నిరాకరణే కారణమా?
వీరిద్దరూ ప్రేమించుకున్నారని, కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. వినయ్ బాబు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2025
"వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా" అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
హైదరాబాద్–ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇంటికి వెళ్లిన మంచిర్యాల జిల్లా… pic.twitter.com/oD68Fh7AGT