సంక్రాంతి సెలవులు (Sankranti holidays) మొదలయ్యాయంటే చాలు హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపు ప్రయాణాలు భారీగా పెరుగుతాయి. పండగ సెలవుల కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (Hyderabad–Vijayawada National Highway)పై వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్థంభించింది. పల్లెల బాట పట్టిన వాహనాలు బారులు తీరడంతో పంతంగి, కీసర టోల్ గేట్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ (Traffic) జామ్ నెలకొంది. నిన్న రాత్రి నుంచే రద్దీ కొనసాగుతుండగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు అదనపు టోల్ గేట్లను తెరిచి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ట్రాఫిక్ ఒత్తిడి పలుమార్లు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో విజయవాడ నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రయాణికుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ లక్షకు పైగా ప్రయాణికులు వెళ్లగా, ఈరోజు రాత్రి లోపే మూడు 2 లక్షల మంది ప్రయాణికులు దాటుతారని అంచనా. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో అదనపు బస్సులు నడుపుతున్నారు. మరోవైపు పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనిపై కాకినాడలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని, అధిక సీట్లు ఏర్పాటు చేసిన బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపైకి రావడంపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








