జూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డికి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. సంజయ్ ఫిర్యాదుల ఆధారంగా కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు సోమవారం ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అరెస్ట్ చేసి, కరీంనగర్‌కు తరలించారు.
కోర్టులో వాదనలు
మంగళవారం ఉదయం కౌశిక్ రెడ్డిని రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డిపై ఉన్న సెక్షన్లు బెయిలేబుల్ కిందకు రావడంతో, బీఆర్‌ఎస్ లీగల్ టీం ఈ మేరకు వాదనలు వినిపించింది. చివరికి కోర్టు రూ. 10 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఇకముందు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని, కోర్టు నిబంధనలు పాటించాలని మెజిస్ట్రేట్ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి కేసులో, 2014లో వచ్చిన అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పు కీలకంగా నిలిచింది. దీని ఆధారంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.