ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణలో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ సినిమా కీలక ప్రేరణగా మారిందని పోలీసులు వెల్లడించారు.
మానవత్వం మర్చిపోయిన రాక్షసుడు
గురుమూర్తి, వెంకటమాధవి (35) దంపతులు. 13 సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత ఐదేళ్లుగా హైదరాబాద్ జిల్లెలగూడలోని శ్రీవేంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆర్మీ నుంచి రిటైరైన గురుమూర్తి.. కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
గురుమూర్తి తన భార్యపై అనుమానం పెరిగి పెద్దదైంది. దీంతో ఆమెను చంపి, శరీరాన్ని ముక్కలు చేసి అంతటితో ఆగలేదు. భార్య తలకాయను కాల్చేసి, దాని వాసన చుట్టుపక్కల వారికి సంక్రాంతి పండగ సందర్భంగా మేక తలకాయ వాసన అనిపించేలా చేశాడు. ఈ ఉదంతం స్థానికంగా కలకలంగా మారింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.
‘దృశ్యం’ సినిమా చూసి ప్రేరణ?
గురుమూర్తి తన దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పలుమార్లు ‘దృశ్యం’ సినిమా పలుమార్లు చూశానని, భార్య శరీరాన్ని ముక్కలు చేయడాన్ని వీడియో తీసి, శరీరం మాయం చేయడానికి ఆయా పద్ధతులను అవలంభించినట్లుగా అంగీకరించాడు. ఈ ఉదంతం పోలీసులకే కాకుండా సమాజానికే షాకింగ్‌గా మారింది.