సినీ నటి హనీరోజ్‌పై లైంగిక వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూరుకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ తనను లైంగిక వేధించాడని నటి హనీరోజ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత వారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేరళ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బాబీ చెమ్మనూర్‌ను వాయనాడ్‌లో కస్టడీలోకి తీసుకుంది. హనీరోజ్ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో బాబీ చెమ్మనూర్ బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది.
హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
by K.N.Chary
Published On: January 14, 2025 2:05 pm
---Advertisement---