హోంమంత్రి ప్ర‌మేయంతోనే పెరోల్‌.. బ‌య‌ట‌ప‌డ్డ ఆధారాలు

హోంమంత్రి ప్ర‌మేయంతోనే పెరోల్‌.. బ‌య‌ట‌ప‌డ్డ ఆధారాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజ‌కీయాల్లో రౌడీషీట‌ర్ (Rowdy-Sheeter) శ్రీ‌కాంత్ (Sreekanth) పెరోల్ అంశం, పెరోల్ క్యాన్సిల్ (Parole Cancel) అయిన వెంట‌నే అత‌ని ప్రియురాలి అరెస్ట్ సంచ‌ల‌నంగా మారాయి. క‌రుడుగ‌ట్టిన ఖైదీకి పెరోల్ జారీ విష‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ  (TDP Party)ని త‌ప్పిదాన్ని నిల‌దీస్తూ, తాజాగా ఈ అంశంలో కీల‌క ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టింది వైసీపీ(YSRCP). హోంమంత్రి (Home Minister) వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) ప్ర‌మేయంతోనే శ్రీ‌కాంత్‌కు పెరోల్ వ‌చ్చింద‌ని, అందుకు సంబంధించిన ఎవిడెన్స్‌ను బ‌హిర్గ‌తం చేస్తూ ట్వీట్ చేసింది. పెరోల్ అంశం అస‌లు త‌న‌కు తెలియ‌ద‌ని మీడియా ముందు చెప్పిన హోంమంత్రి.. తాజాగా వైసీపీ విడుద‌ల చేసిన ఆధారాల‌తో అడ్డంగా దొరికిపోయిన‌ట్లుగా తెలుస్తోంది.

తీవ్రమైన నేరాలకు సంబంధించి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న రౌడీషీట‌ర్‌ అలివేలి శ్రీకాంత్‌కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్‌ మంజూరు చేయడంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నేరుగా జోక్యం చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. అధికారిక నివేదికలు, ఫైల్‌ నోట్లు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. జూలై 16న హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ కేవీ కిషోర్‌ కుమార్‌ (KV Kishore Kumar) ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించారు. గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన అనుభవం ఉన్న శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇవ్వడం అసాధ్యం అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు కూడా అదే సూచిస్తూ నివేదిక సమర్పించారు.

అయినా నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌ పట్టుబట్టి హోం మంత్రి వద్ద లాబీయింగ్‌ చేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ సన్నిహితురాలు అరుణతో డీల్‌ కుదిరిన తర్వాత, స్వయంగా హోం మంత్రి అనిత నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారు. దీంతో ఆ ఫైల్‌ హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ వద్దకు చేరింది. చివరకు మంత్రి ఒత్తిడి కారణంగా ఆయన జూలై 30న పెరోల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అని వైసీపీ పేర్కొంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించిన‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment