ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)పై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. అక్రమ దందాలు, సెటిల్‌మెంట్లు, పేకాట శిబిరాలు, వైన్‌షాపుల్లో వాటాల ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడని తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు వేశారు. టీడీపీ నేతల వద్ద కూడా వసూళ్లకు పాల్పడుతున్నట్లు జగదీష్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
హోంమంత్రి అనిత వద్ద జగదీష్ పది సంవత్సరాలుగా పీఏగా ఉన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం నేరుగా సిఫార్సులు చేస్తున్నట్లుగా ఇటీవల జగదీష్‌పై ఆరోపణలు తీవ్రమయ్యాయి. టీడీపీ నేతల్ని సైతం బెదిరించి జగదీష్ వసూళ్ల చేస్తున్నారని, హోంమంత్రి చెప్పినా ఫలితం లేదని నేతల ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నేరుగా ఫిర్యాదు చేయడంతో అనిత పీఏ జగదీష్‌పై ప్రభుత్వం వేటు వేసింది. అతనిపై వేటుతోనే సరిపెడతారా..? లేక ఇన్నాళ్లూగా ఆయన సాగించిన అక్రమ దందాపై దృష్టిపెడతారా..? అనేది వేచి చూడాలి








