హోంమంత్రి భోజనంలో బొద్దింక‌..! వీడియో వైర‌ల్‌

హోంమంత్రి భోజనంలో బొద్దింక‌..! వీడియో వైర‌ల్‌

భోజ‌నంలో బొద్దింక‌ (Cockroach).. అదీ ఏకంగా ఏపీ హోంమంత్రి (AP Home Minister) భోజ‌నం (Meal)లో ద‌ర్శ‌నమివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha)కు భోజనంలో బొద్దింక కనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం విద్యార్థుల‌కు అందించే భోజ‌నంలో నాణ్య‌త‌లోపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఈ వీడియో బీసీ బాలికల హాస్టల్‌ (BC Girls Hostel)లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినదిగా తెలుస్తోంది, ఇందులో మంత్రి అనిత భోజనం చేస్తుండగా ఆమె ఆహారంలో బొద్దింక క‌నిపించ‌గా, దాన్ని ప‌ట్టుకొని ప్ర‌శ్నిస్తున్న‌ వీడియో సోషల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు అందించే మధ్యాహ్న భోజన పథకం (డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం) గురించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. “జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాటు పౌష్టికాహారం నాణ్య‌త‌కు తిలోద‌కాలు ఇచ్చేశారా..? విద్యార్థులకు పురుగుల ఆహారం వడ్డిస్తున్నారా?” అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. డొక్కా సీతమ్మ వంటి మహాతల్లి పేరును చెడగొట్టవద్దని కోరుతున్నారు. విద్యా శాఖ ప‌ట్ల ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. అయితే భోజ‌నంలో వ‌చ్చిన‌ బొద్దింకను ప‌ట్టుకొని అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్న వీడియో.. హోం మంత్రి సోమ‌వారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్‌ సందర్శించి స‌మ‌యంలో అని తేలింది. ఈ ఘ‌ట‌న‌పై హోం మంత్రి అనిత, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం పేరును డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంగా మార్చింది. విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మ‌ధ్యాహ్న భోజ‌నం తిని విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురై, ఆస్ప‌త్రుల్లో చేరిన ఘ‌ట‌న‌లు విరివిగా చోటుచేసుకుంటున్నా.. అవి అంత‌గా హైలైట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా హోంమంత్రి భోజ‌నంలోనే బొద్దింక ద‌ర్శ‌న‌మివ్వ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. విద్యార్థుల‌కు టిఫిన్, భోజ‌నంతో పాటు చిక్కీని కూడా అందించేవారు. రోజుకో మెనూతో విద్యార్థుల‌కు భోజ‌నం అందించేవారు. అయితే, ఈ ఘటన తర్వాత, పథకంలో నాణ్యత, ఆహార శుభ్రతపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment