మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!

మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!

చైనాను ఆందోళనకు గురిచేస్తున్న HMPV వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇప్పటికే ఈ వైరస్‌కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం కలవరం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, హ్యాండ్ హైజీన్ పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అవుతున్నాయి.

చైనా వైర‌స్ సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాల‌ని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాల‌ని, రద్దీ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. కేసుల పెరుగుద‌ల దృష్ట్యా కర్ణాటక, మహారాష్ట్రలో మార్గదర్శకాలు విడుద‌ల చేసింది.

వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే..
HMPV (హ్యూమన్ మెటాప్నూమోవైరస్) ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ చిన్నారులు మరియు వయో వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు, బాడీ పెయిన్స్ ఉంటే వెంట‌నే డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment