చైనా వైరస్ భారతదేశానికి వ్యాపించింది. దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదవుతుండగా, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏకంగా 11 కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల ద్వారా 11 మందికి HMPV పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గతేడాది డిసెంబర్‌లోనే ఈ కేసులు నమోదయ్యాయని ఓ ప్రైవేట్ ల్యాబ్ వెల్లడించింది. ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. 258 శ్వాసకోశ పరీక్షలలో 11 శాంపిల్స్ పాజిటివ్‌గా తేలాయి. అయితే, వారు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు హామీ ఇచ్చారు.
ICMR ప్రకటన
ఈ వైరస్ కొత్తదేనంటూ వచ్చే ప్రచారాన్ని కొట్టిపారేసిన ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), HMPV ఇండియాలో చాలా కాలం నుంచే ఉందని స్పష్టం చేసింది. సాధారణంగా ఇది చిన్నపిల్లలు మరియు వృద్ధుల్లో స్వల్ప శ్వాసకోశ ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉన్నట్లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.