నేచురల్ స్టార్ (Natural Star) నాని (Nani) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘హిట్ 3 (HIT 3)’ ట్రైలర్ (Trailer) యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 21.30 మిలియన్ల (Million) వ్యూస్ (Views)ను రాబట్టింది. ఈ క్రమంలో 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్‌తో నిలిచిన RRR ట్రైలర్ రికార్డు (Record) ను దాటేసి, రెండో స్థానాన్ని (Second Position) ఆక్రమించింది. అయితే ఇంకా అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్‌గా ‘పుష్ప-2’ (44.67 మిలియన్లు) టాప్ (Top)లో కొనసాగుతోంది.
నాని అభిమానుల్లో ఈ ట్రైలర్ పట్ల మంచి హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా, హిట్ సీరీస్‌కు ఉన్న క్రేజ్ కూడా ఈ రికార్డుకు తోడ్పడింది. ‘హిట్ 3’ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ లుక్‌లో నాని ఆకట్టుకుంటున్నాడు.