‘HIT-3’ రిలీజ్‌.. ఫ్యాన్స్, పబ్లిక్ టాక్ ఏంటంటే..

‘HIT-3’ రిలీజ్‌.. ఫ్యాన్స్, పబ్లిక్ టాక్ ఏంటంటే..

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘HIT-3’ చివరకు థియేటర్లలోకి వచ్చేసింది. శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని స‌ర‌స‌న‌ శ్రీనిధిశెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది. ప్రీమియర్ షోల తర్వాత వస్తున్న పబ్లిక్ రివ్యూల (Public Reviews) ప్రకారం.. నాని ఈసారి తన మాస్ యాక్షన్ లుక్‌ (Mass Action Look) తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. “ఇలాంటి ఇంటెన్స్ రోల్‌లో నానీని చూడడం కొత్త అనుభూతి” అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్సులు, ఎమోషనల్ డ్రామా మెచ్చుకోద‌గిందిగా ఉందని ప‌బ్లిక్ టాక్‌.

అయితే ఫస్టాఫ్ కథనం ఊహించదగ్గ విధంగా సాగడమే కాకుండా, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా నడవడం ప్రేక్షకులను కొద్దిగా నిరాశపరిచింది. అయినప్పటికీ, నానీ పెర్ఫార్మెన్స్‌ మొత్తం సినిమా మీద ఒక హైపే క్రియేట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మే డే రోజు రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సాధిస్తోంది.

కాగా, హిట్‌-3 సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు క‌ల్పించింది. చిత్ర యూనిట్ చేసిన విజ్ఞప్తికి స్పందనగా ప్రభుత్వం వారం రోజుల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌ లో రూ.50, మల్టీప్లెక్స్‌ లలో రూ.75 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అంగీక‌రించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment