హిట్ 3 టీజర్ విడుదల.. ఆ ఒక్క డైలాగ్‌తో మూవీకి హైప్‌

హిట్ 3 టీజర్ విడుదల.. ఆ ఒక్క డైలాగ్‌తో మూవీకి హైప్‌

నేచుర‌ల్ స్టార్ నాని (Nani), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరో హీరోయిన‌ట్లుగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ (HIT 3) సినిమా టీజర్ విడుదలైంది. నాని పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సస్పెన్స్‌ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేసింది. శ్రీనగర్ నేపథ్యంలో కథ నడుస్తుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది.

టీజ‌ర్‌లో నేచుర‌ల్ స్టార్ నానిని వైల్డ్‎గా చూపించారు. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ కాప్ పాత్రలో నాని అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని మేక‌ర్స్ రిలీజ్ చేసిన‌ టీజర్ చూస్తే స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. వైల్డ్ పోలీస్‎ అధికారి క్యారెక్టర్‎లో నాని దుమ్ములేపాడు. సినిమాలో హీరో పాత్ర గురించి రావు రమేష్ ఇచ్చిన హైప్ అభిమానుల్లో ఆస‌క్తిని పెంచింది. టీజ‌ర్‌లో నాని చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడివి శేషు న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేష‌న్ క‌థ‌గా సాగే హిట్ సిరీస్‎లోని మూడ‌వ‌ భాగంలో నాని నటిస్తుండటంతో ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ అయ్యింది. హిట్ 2 సినిమా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment