బాల‌కృష్ణ అనుచ‌రుల‌తో ప్రాణ‌హాని – ముస్లిం మ‌హిళ సంచ‌ల‌న వీడియో

బాల‌కృష్ణ అనుచ‌రుల‌తో ప్రాణ‌హాని - ముస్లిం మ‌హిళ సంచ‌ల‌న వీడియో

శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లోని హిందూపురం నియోజకవర్గం(Hindupuram Constituency)లో మహిళ (Woman)పై వేధింపుల  (Harassment) ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)లో శానిటరీ వర్కర్‌గా పని చేస్తున్న రుక్సానా (Ruksana) అనే మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, తిరిగి ఉద్యోగం కావాలంటే ‘పక్కలోకి రావాలి’ అంటూ టీడీపీ(TDP) నేత‌లు బెదిరింపులు చేసిన ఆడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే బాధితురాలు త‌న‌కు టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ (Balakrishna) అనుచ‌రులు యుగంధర్ అలియాస్ చింటు, అమర్ అనే నేతల నుంచి ప్రాణహాని ఉందని, హిందూపురం వదిలిపెట్టాలని బెదిరిస్తున్నారని సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేశారు.

తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ, ప్రధాన సూత్రధారులపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌లో వేధించిన టీడీపీ కార్యకర్త కగ్గాలప్పపై కేసు నమోదు చేసినప్పటికీ, ప్రధాన సూత్ర‌ధారుల‌ను వ‌దిలేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ముస్లిం మ‌హిళ, ఆమె కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కంప్ల‌యింట్ ఇస్తే సీఐ తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆమె ఓ వీడియో విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రుక్సానా, “ఉద్యోగం పోయినదీ ఓ బాధే.. కానీ న్యాయం కోసం పోరాడుతున్న నాకు ప్రాణహాని ఉంది” అంటూ వెల్లడించారు.

ఈ ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనంగా ఉండటాన్ని కూడా బాధితురాలు తీవ్రంగా విమర్శించారు. మ‌హిళ‌ను బెదిరించిన టీడీపీ నేత యుగంధ‌ర్ ఇటీవ‌ల హిందూపురంలో ప‌ర్య‌టించిన బాల‌కృష్ణ‌ భార్య వసుంధరను కలిసిన ఫొటోలు బ‌య‌ట‌ప‌డ‌డంతో నిందితుల‌కు బాల‌కృష్ణ అండ‌దండ‌లు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌హిళ‌ను వేధించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా, వారితో ఫొటోలు దిగ‌డం ఏంట‌ని హిందూపురం వాసులు ప్ర‌శ్నిస్తున్నారు. టీడీపీ నేతల వైఖరిపై అధికార పార్టీల నేతలు, మహిళా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment