చంద్ర‌బాబు కుటుంబ సంస్థ‌కు భారీ నజరానా.. జీవో జారీ

చంద్ర‌బాబు కుటుంబ సంస్థ‌కు భారీ నజరానా.. జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక వ్య‌వ‌స్థ (Economic System) అంతంత మాత్రంగానే కొన‌సాగుతున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu) తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ప్ర‌తి మంగ‌ళవారం కొత్త అప్పు తెస్తున్న ప్ర‌భుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన ‘హెరిటేజ్ ఫుడ్స్’ (Heritage Foods) కు భారీగా రాయితీలు కల్పిస్తూ జీవో నంబర్ 57 (GO No.57 – Government Order) జారీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టాక్ మార్కెట్‌లో భారీగా షేర్ వాల్యూ ప‌డిపోయిన త‌రుణంలో రాయితీలు ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

35 ఉద్యోగాల కోసం రూ.59.69 కోట్ల రాయితీలు
కేవలం 35 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే కారణంతో హెరిటేజ్ సంస్థకు సుమారు రూ. 59.69 కోట్ల మేర రాయితీలు ఇవ్వాలని చంద్ర‌బాబు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ‘టైలర్ మేడ్’ రాయితీల వివరాలు ఇలా..
– టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ సబ్సిడీ కింద సంస్థలోని సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ఏకంగా రూ. 34.93 కోట్లు కేటాయించింది.
– రాబోయే ఐదేళ్ల పాటు హెరిటేజ్ సంస్థకు 100 శాతం జీఎస్టీ రీయంబర్స్ మెంట్ కల్పించారు. దీని ద్వారా సంస్థకు రూ. 17.80 కోట్ల అదనపు లబ్ధి చేకూరనుంది.
– ఐదేళ్ల పాటు ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై రూ. 1 రాయితీతో పాటు, ఎలక్ట్రిసిటీ డ్యూటీలోనూ మరో రూ. 1 తగ్గింపు ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 2 కోట్లు.
– సంస్థ తీసుకునే రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివాదాల నడుమ హెరిటేజ్..
ఇటీవలి కాలంలో హెరిటేజ్ సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా టీటీడీ(TTD) లడ్డూ ప్రసాదం (Laddu Prasadam) నెయ్యి సరఫరా (Ghee Supply) విషయంలో ఇందాపూర్ డెయిరీకి (Indapur Dairy), హెరిటేజ్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ సొమ్మును (TTD Funds) పరోక్షంగా హెరిటేజ్‌కు కట్టబెడుతున్నారని ఆధారాలతో సహా ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై శాసనమండలిలో నాలుగు రోజుల పాటు వాయిదా తీర్మానాలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని తిరస్కరించడం గమనార్హం. ఈ వివాదాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.

విమర్శల వెల్లువ
ప్రభుత్వ ధనాన్ని సొంత కుటుంబ సంస్థకు ధారపోయడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే, మరోవైపు కేవలం 35 మంది ఉద్యోగుల కోసం రూ. 60 కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజా జీవో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment