ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు ప్రయాణిస్తుంద‌ని, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.

జిల్లాల్లో భారీ వర్షాలు..
అల్పపీడ‌నం కార‌ణంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ వర్షాలు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment