హేజిల్‌వుడ్‌కు గాయం.. ఆసీస్ బౌలింగ్‌కు పెద్ద దెబ్బ

హేజిల్‌వుడ్ గాయం.. ఆసీస్ బౌలింగ్‌కు పెద్ద దెబ్బ

బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డారు. కాలి గాయం (Leg Cramps injury)తో మైదానాన్ని విడిచి వెళ్లాడు. హేజిల్‌వుడ్‌ను వెంటనే స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్రకటించింది. స్కానింగ్ రిపోర్టు వ‌చ్చిన అనంత‌రం గాయం తీవ్ర‌త తెలియ‌నుంది.

జోష్ హేజిల్‌వుడ్ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌లో ముఖ్యమైన భాగం. మూడోరోజు ఆట‌లో త‌న అద్భుత‌మైన బౌలింగ్‌తో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. భారత ఇన్నింగ్స్ సమయంలో అతను నాలుగో రోజు మొదటి సెషన్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. కండరాల సమస్యతో హేజిల్‌వుడ్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

గాయం ఆస్ట్రేలియా బౌలింగ్ జ‌ట్టుకు పెద్ద దెబ్బగా మారింది. టీమిండియాను తొందరగా ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించాలనే ఆసీస్ ప్లాన్ ఇప్పుడు కష్టంలో పడింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 201/7గా ఉంది. క్రీజ్‌లో సిరాజ్‌, ర‌వీంద్ర జ‌డేజా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment