హాథిరాం బావాజీ మఠం కూల్చివేతపై కవిత ఆందోళన – ఏపీ సీఎంకు విజ్ఞప్తి

హాథిరాం బావాజీ మఠం కూల్చివేతపై కవిత ఆందోళన – ఏపీ సీఎంకు విజ్ఞప్తి

తిరుపతి (Tirupati)లోని చారిత్రక హాథిరాం (Hathiram) బావాజీ (Bavaji) మఠం (Monastery) కూల్చివేత నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ప్రాధాన్యం కలిగిన ఈ మఠాన్ని కూల్చివేయకూడదంటూ, తెలంగాణ (Telangana) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు విజ్ఞప్తి చేశారు.

భక్తుల మనోభావాలను గౌరవించాలి
కవిత మాట్లాడుతూ.. కూల్చివేత నిర్ణ‌యంతో హాథిరాం బావాజీని ఆరాధించే బంజారా సమాజంతో పాటు కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం తగదని తెలిపారు. మఠం కూల్చివేత నిర్ణయం భక్తుల మనసుకు గాయపడేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలని, మఠాన్ని కాపాడాలని కవిత కోరారు. “భక్తుల మనసు దెబ్బతినే నిర్ణయాలు కాకుండా, వారి విశ్వాసాలను కాపాడే చర్యలు తీసుకోవాలి” అంటూ సీఎం చంద్రబాబును ఆమె అభ్యర్థించారు.

తిరుమల–తిరుపతి ప్రాంతంలో హాథిరాం బావాజీ మఠం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. మఠాన్ని కూల్చివేయాలనే నిర్ణయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవగా, కవిత వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment