హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావ‌డంతో గురుగ్రామ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన 1989 నుంచి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు.

చౌతాలా హర్యానాలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా, ప్రత్యేకించి రైతు సమస్యల ప‌ట్ల పోరాడిన నాయ‌కుడిగా పేరు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రి కాలంలో ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని ప‌లువురు కొనియాడుతున్నారు.

హర్యానా మాజీ సీఎం చౌతాలా మృతి పట్ల ప్రధాని న‌రేంద్ర‌ మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. “ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటూ చౌదరి దేవిలాల్ పనితనాన్ని మెరుగయ్యేలా చేశారు. ఇలాంటి విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment