భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకత్వంపై ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తి పూర్తి బాధ్యతలను ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేతుల్లో పెట్టబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంలోనే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలైనట్లుగా, అవి తారాస్థాయికి చేరినట్లుగా రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలోని అగ్రనాయకుల్లో ఒకరైన హరీష్‌రావు (Harish Rao) ఈ విషయంపై స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు.
బీఆర్ఎస్‌లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆరఎస్ పూర్తిస్థాయి బాధ్యతలు (Responsibilities) అప్పగిస్తే స్వాగతిస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను తాను శిరసావహిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అగ్రనాయకులు కేటీఆర్ (KCR)-హరీష్‌రావు మధ్య విభేదాలు ఉన్నాయనేది తరచూ వినిపించే వార్తే. అయినా ఎప్పటికప్పుడూ ఆ వార్తలను వీరిద్దరు నేతలు ఖండిస్తూనే ఉన్నప్పటికీ, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ దూరమైన నాటి నుంచి మరింత ఎక్కువయ్యాయి. పార్టీ బాధ్యతలను కేటీఆర్ తీసుకుంటారా.. లేక బావ హరీష్ రావు చేతుల్లో పెడతారా..? అని రకరకాల పుకార్లు వచ్చాయి. అపోహలు. అనుమానాలన్నింటికీ ముగింపు పలికారు హరీష్ రావు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తాననన్నారు. బీఆర్ఎస్‌లో ఆధిపత్య చిచ్చు పెట్టాలనుకునేవారికి హరీష్‌రావు సమాధానం చెంపపెట్టు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు వైరివర్గం నేతలకు చురకలు అంటిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.