కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ (BRS) నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. కమిషన్ నివేదికను రాజకీయ దురుద్దేశంతో తయారు చేశారని ఆరోపిస్తూ, అసెంబ్లీ (Assembly)లో చర్చకు తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల పాలన చేస్తోంది. కాళేశ్వరం నివేదిక ఆధారాల్లేని వట్టి ఆరోపణల సమాహారం. అసలు నిజాలు బయటకు రావాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి” అన్నారు.
పోలవరం రెండు సార్లు కూలినా స్పందించని NDSA, కానీ మేడిగడ్డ (Medigadda) బ్యారేజీ (Barrage)లో రెండు పిల్లర్లు కుంగితే మాత్రం వెంటనే రిపోర్టు వచ్చింది. ఇది వర్గపోషక చర్య కాదా?” అని ప్రశ్నించారు.
రాజకీయ కక్షతో ఇచ్చే రిపోర్టులు కోర్టులో నిలవవు, చివరికి ధర్మమే గెలుస్తుంది అంటూ హెచ్చరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు నీటి సమస్యలు వంటి అంశాల్లో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టమైందని ఆరోపించారు.