---Advertisement---

ఆ మూడు కీలక విషయాల్లో రేవంత్ సర్కార్ విఫలం

ఆ మూడు కీలక విషయాల్లో రేవంత్ సర్కార్ విఫలం
---Advertisement---

ఎన్నిక‌ వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ విజన్‌ పేరుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం.. నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింద‌ని ప్ర‌శ్నించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అదేవిధంగా, ఏపీ నిర్మిస్తున్న బన‌కచర్ల ప్రాజెక్టు విష‌యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

రాష్ట్రం ఆర్థిక రుణం పెరుగుతోంది
పొరుగున్న తెలుగు రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణ‌కు రావాల్సిన రూ.8,929 కోట్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాబట్టలేకపోయిందని హరీష్‌రావు విమర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని కూడా రేవంత్ స‌ర్కార్ అట‌కెక్కించింద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment