తన ఇల్లు తాక‌ట్టుపెట్టి.. మాన‌వ‌త్వం చాటుకున్న హ‌రీష్‌రావు

తన ఇల్లు తాక‌ట్టుపెట్టి.. మాన‌వ‌త్వం చాటుకున్న హ‌రీష్‌రావు

సిద్దిపేటలో (Siddipet) మానవతా దృక్పథానికి నిదర్శనంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మరోసారి ముందుకొచ్చారు. పీజీ వైద్య విద్య (Postgraduate Medical Education) కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థిని మమతకు (Student Mamatha) ఆయన అండగా నిలిచారు.

సిద్దిపేటకు చెందిన మమతకు పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో భవిష్యత్తుపై ఆశలు పెరిగాయి. అయితే కళాశాల యాజమాన్యం ప్రతి ఏడాది ట్యూషన్ ఫీజులుగా రూ.7.50 లక్షలు చెల్లించాలని స్పష్టం చేయడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా, ఆస్తి తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకర్లు షరతు విధించారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు వెంటనే స్పందించారు. తన స్వగృహాన్ని (Own House) బ్యాంకులో (Bank) మార్టిగేజ్ (Mortgage) చేసి, విద్యార్థిని మమతకు రూ.20 లక్షల విద్యా రుణం(Loan) మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మమతకు పీజీ వైద్య విద్య కొనసాగించే మార్గం సుగమమైంది.

అదే విధంగా హాస్టల్ ఫీజుల కోసం హరీష్ రావు రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం(Financial Assistance) కూడా అందించినట్లు విద్యార్థిని తండ్రి రామచంద్రం తెలిపారు. తమ కూతురి చదువుకు అండగా నిలిచిన హరీష్ రావుకు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పదవిలో లేకపోయినా, ప్రజా ప్రతినిధిగా తన సామాజిక బాధ్యతను నిరూపిస్తూ హరీష్ రావు చేసిన ఈ సహాయం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment