---Advertisement---

సినిమా టికెట్ ధ‌ర పెంపు, బెనిఫిట్ షో అనుమ‌తి.. రేవంత్‌పై హ‌రీశ్ ఫైర్‌

సినిమా టికెట్ ధ‌ర పెంపు, బెనిఫిట్ షో అనుమ‌తి.. రేవంత్‌పై హ‌రీశ్ ఫైర్‌
---Advertisement---

సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తిపై ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. గేమ్ ఛేంజ‌ర్ సినిమా టికెట్ల రేట్ పెంచుకునేందుకు, బెనిఫిట్ షోకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. దీంతో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు.

ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించార‌ని, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని హ‌రీశ్‌రావు తెలిపారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయన్నారు.

అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోస్ కి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేన‌ని, అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. గతంలో ప్ర‌భుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినప్పుడు, ఒక మహిళ చనిపోవడం, బాలుడు ఆసుపత్రిలో చేరడం జరిగాయని హ‌రీశ్‌రావు గుర్తుచేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment