పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ట్రైలర్ (Trailer) విడుదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఓ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చినప్పటికీ, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ట్రైలర్ హైలైట్స్
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యోధుడి పాత్ర (Warrior’s Role)లో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ అదిరిపోయాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సుమారు 3 నిమిషాల 1 సెకను నిడివి గల ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సినిమా వివరాలు
ఈ సినిమాకు మొదట క్రిష్ (Krish) దర్శకత్వం వహించగా, ఆ తర్వాత నిర్మాత ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, అలాగే సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రిలీజ్ & ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు
‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని జులై 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ట్రైలర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అయితే, జులై 2న ఉదయం ఎంట్రీ పాస్‌ల కోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. భద్రతా కారణాల దృష్ట్యా ట్రైలర్ స్క్రీనింగ్‌ను రద్దు చేయకతప్పలేదు.