పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, సినిమా నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M.Ratnam) ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించి అంచనాలను మరింత పెంచేశారు.
ధర్మం కోసం పోరాడే యోధుడు పాత్రలో..
‘హరి హర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ ధర్మం కోసం పోరాడే యోధుడి (Warrior) పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు (A. Dayakar Rao) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ కూడా దర్శకత్వ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్, విడుదల తేదీ
‘హరి హర వీరమల్లు’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు, జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా (Shilpakala) వేదికలో అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ఉత్సాహంతోనే చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.