పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) (HHVM) భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఓపెనింగ్ డే నుండి మంచి హైప్‌తో సాగిన ఈ సినిమా మొదటి రెండ్రోజులు వసూళ్ల విషయంలో పర్వాలేదు అనిపించింది. కానీ, ఐదో రోజుకే కలెక్షన్ల పరంగా తీవ్రంగా వెనకపడింది. ఆరో రోజు కలెక్షన్లు (Collections) మరి తగ్గిపోయాయి.సినీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఐదో రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.32 కోట్లు గ్రాస్, ఆరో రోజు రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇప్పటివరకు సినిమా రూ.108 కోట్ల గ్రాస్‌ను రాబట్టగా, అది కేవలం 52 శాతం రికవరీగా మాత్రమే లెక్కవేస్తున్నారు.
ఈ తక్కువ వసూళ్లకు ప్రధాన కారణంగా మిక్స్డ్ టాక్ అని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రేక్షకుల నెగటివ్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు కూడా ఓవరాల్ బజ్‌కి దెబ్బతీశాయి. మరోవైపు, అదే సమయంలో విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narasimha)కి అద్భుతమైన రివ్యూలు రావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం HHVMకి మరో మైనస్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ‘హరి హర వీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద తమ ట్రాక్‌ను తిరిగి పటిష్ఠంగా నిలబెట్టుకోగలదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే వారాంతపు కలెక్షన్లు కీలకంగా మారాయి. వర్కింగ్ డేస్‌లో పడిపోయిన వసూళ్లు, పాజిటివ్ మౌత్ టాక్ లేకపోవడం సినిమా మొత్తం రన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.







