పీక‌ల్లోతు క‌ష్టాల్లో బ‌య్య‌ర్లు.. అడ్ర‌స్ లేని నిర్మాత‌!!

'హరి హర వీరమల్లు' బయ్యర్ల కష్టాలు.. నిర్మాత ఎ.ఎం.రత్నం మిస్సింగ్?

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా కొనుగోలు చేసిన బ‌య్య‌ర్లు (Buyers) పీక‌ల్లోతు క‌ష్టాల్లో మునిగిపోయారు. సినిమా విడుదలై మూడు వారాలు దాటినా, దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలయ్యే ముందు దీనిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కారణం, నిర్మాత (Producer) ఎ.ఎం.రత్నం రన్నింగ్‌ (A.M. Ratnam)లో లేకపోవడం, ఒకవేళ సినిమా ప్లాప్ అయితే జీఎస్టీలు(GST) తిరిగి ఇవ్వడం కష్టం అవుతుందని బయ్యర్లు భయపడ్డారు.

అయితే, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని, కొన్ని చర్చలు, రాజీలతో బయ్యర్లను సినిమా కొనుగోలుకు ఒప్పించారు. అలా వైజాగ్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు వంటి కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లు సినిమాను కొనుగోలు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ, సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో బయ్యర్లందరూ భారీగా నష్టపోయారు. పీక‌ల్లోతు న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నారు.

కోర్టుకెళ్లే యోచనలో బయ్యర్లు
ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. ప‌వ‌న్ హామీతో కొనుగోలు చేసిన‌ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ప్లాప్ కావడంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. వారిప్పుడు జీఎస్టీలు క‌ట్టాలి. అలా క‌ట్టాలంటే వారికి జీఎస్టీ ఇన్వాయిస్‌లు ఇవ్వడానికి నిర్మాత ఎ.ఎం.రత్నం అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. దీంతో ఇద్దరు ముగ్గురు బయ్యర్లు కలిసి తదుపరి చర్యల గురించి చర్చించుకుంటున్నారు. రత్నంను ఎలా సంప్రదించాలో ఆలోచిస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఫైనాన్సియర్ సత్య రంగయ్య సంస్థ కూడా భాగం కావడంతో, ఆ సంస్థను కూడా సంప్రదించాలని బయ్యర్లు భావిస్తున్నారు. కొందరు కోర్టు ద్వారా ముందుకు వెళ్లడానికి కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment