భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తాజాగా సోషల్ మీడియాలో ఒక ఘాటైన సందేశాన్ని షేర్ చేస్తూ, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ (Photographers) ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబై బాంద్రా (Bandra)లోని ఒక రెస్టారెంట్ వద్ద తన ప్రియురాలు మహికా శర్మ (Mahika Sharma)ని అనుచితంగా చిత్రీకరించిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిక్ ఫిగర్‌గా కెమెరాల దృష్టిలో ఉండటం సహజమేనని అర్థం చేసుకున్నానని, కానీ ఈసారి ఫోటోగ్రాఫర్స్ ప్రవర్తన అన్ని హద్దులను దాటిందని పేర్కొన్నాడు.
మహికా మెట్లు దిగుతున్న సమయంలో ఆమెను అసౌకర్యానికి గురిచేసేలా ఫోటోలు, వీడియోలు తీసిన విధానం బాధాకరమని చెప్పాడు. మీడియాతో ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తానని, కానీ ఇలాంటి వ్యవహారం తగదని విజ్ఞప్తి చేశాడు. చివరగా “దయచేసి కొంత మానవత్వం చూపండి” (Please Show Some Humanity) అని తన పోస్టును ముగించాడు.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ నేపథ్యంలో, హార్దిక్ పాండ్యా గాయాలతో రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో కటక్‌లో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున మైదానంలోకి దిగనున్నారు. మరోవైపు, మహికా శర్మ ప్రముఖ మోడల్‌గా, మ్యూజిక్ వీడియోలు మరియు షార్ట్ ఫిల్మ్‌లలో నటించి పేరు సంపాదించింది. ప్రస్తుతం హార్దిక్–మహికా రిలేషన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.








