టీమిండియాకు గొప్ప శుభవార్త. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారే ట్రోఫీ ద్వారా వన్డే క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం.
గతంలో వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో గాయపడిన హార్దిక్, వన్డే ఫార్మాట్‌కు దూరమయ్యారు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మళ్లీ వన్డేలపై దృష్టిపెట్టారు. ఆయన రీ-ఎంట్రీ టీమ్ ఇండియాకు పెద్ద బలంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
హార్దిక్ రీ-ఎంట్రీతో టీమ్ ఇండియా బలపడేనా?
హార్దిక్ పాండ్య రాబోయే విజయ్ హజారే ట్రోఫీ ద్వారా తన ఆల్‌రౌండ్ ప్రతిభను మరోసారి ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు టీమ్ కోసం కీలక పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ రీ-ఎంట్రీ టీమ్ ఇండియాకు కలిసొచ్చే అవకాశం అవుతుందని అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.