టీమ్ ఇండియా (Team India) స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రేమబంధంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల నటాషా (Natasa)తో విడాకులు తీసుకున్న తరువాత, మొదట జాస్మిన్ వాలియా (Jasmin Walia)తో డేటింగ్ రూమర్లు వచ్చినా, ప్రస్తుతం మోడల్-నటి మహికా శర్మ (Mahika Sharma)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. భారత క్రికెట్‌లో కపిల్‌దేవ్ తర్వాత గొప్ప ఆల్‌రౌండర్‌గా నిలిచిన హార్దిక్, ఆటతో పాటు వ్యక్తిగత జీవితంలోని వివాదాలతోనూ తరచుగా చర్చనీయాంశమవుతుంటారు. తన కొత్త లవర్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌పై హార్దిక్ పాండ్యా స్వయంగా స్పష్టతనిచ్చారు. పుట్టినరోజుకు ఒక రోజు ముందు మహికా శర్మతో కలిసి ఉన్న ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో వారు బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం కనిపించింది. ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఈ ఫోటోలు ధృవీకరిస్తున్నాయి.
మహికా శర్మ విషయానికొస్తే, ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనిష్క్, వివో, యునిక్లో వంటి ప్రముఖ బ్రాండ్‌ల ప్రకటనల్లో కనిపించారు. అంతేకాకుండా, ఆమె కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో కూడా నటించారు. వీటిలో వివేక్ ఒబెరాయ్‌తో నటించిన ‘ఇన్ టు ది డస్క్’ మరియు ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాలు ముఖ్యమైనవి.








