బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో విమర్శల వెల్లువ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్‌స్టార్ సంస్కృతిని విడిచిపెట్టాలని ఇటీవల చేసిన సూచనతో చర్చకు దారితీసిన హర్భజన్, తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్‌తో మరింత దుమారం రేపారు. ఆయన తన పోస్ట్‌లో “మార్కెట్లో ఏనుగు నడిచే సమయంలో, డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి” అని రాశారు.
हाथी चले बजार
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 9, 2025
पालतू ( paid) कुते भौंके हजार
ప్రస్తుతం భజ్జీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరిని ఉద్దేశించి హర్భజన్ ఈ పోస్ట్ పెట్టారు ? అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మాటలు కాస్త అదుపులో పెట్టుకోవాలని మరికొందరు అభిమానులు భజ్జీకి సూచిస్తున్నారు. హర్భజన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చకు కేంద్రబిందువుగా మారాయి.