రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

రాష్ట్రపతితో నూతన సీఈసీ భేటీ.. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ కొత్త సీఈసీగా నియమితులయ్యారు. సీఈసీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి జ్ఞానేశ్ కుమార్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, దేశ ఎన్నికల ప్రక్రియ, సంస్కరణలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

గత ఏడాది మార్చిలోనే జ్ఞానేశ్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రాజీవ్ కుమార్ పదవి విరమణ జ‌రిగిన‌ వెంటనే, ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆయన పేరును రాష్ట్రపతికి సిఫారసు చేసింది. వెంటనే రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసి, జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించింది. ఈయన 2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

కేరళ కేడర్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో, సహకార మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పనిచేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ-కాశ్మీర్ ఇంఛార్జిగా కీలక పాత్ర పోషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment