---Advertisement---

చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్ట‌ర్‌ గుకేశ్!

చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్ట‌ర్‌ గుకేశ్!
---Advertisement---
  • 18 ఏళ్ల యువ సంచలనం వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అవతరణ

భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చ‌రిత్ర సృష్టించాడు. సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)పై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ టైటిల్‌ను త‌న సొంతం చేసుకున్నాడు. ఈ ఫీట్‌ను 18 ఏళ్ల వ‌య‌స్సులోనే సాధించి అంద‌రినీ అబ్బుర‌ప‌రిచాడు గుకేశ్‌.

అతి పిన్న వ‌య‌సులో..
ఆఖరిదైన 14వ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్ 58 ఎత్తుల్లో ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను తన సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ గేమ్‌ల టోర్నీలో 7.5-6.5 తేడాతో విజయం సాధించిన గుకేశ్, చెస్ చరిత్రలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా చెస్ దిగ్గ‌జం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment