రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?

రూ.3 కోట్లు పెట్టి ఉద్యోగం ఎలా కొంటాం సారూ..?

గ్రూప్-1 ఫలితాలపై (Group-1 Results) వచ్చిన ఆరోపణలను ఖండించడానికి ర్యాంకర్ల (Rankers) తల్లిదండ్రులు (Parents) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తమ పిల్లల కష్టాన్ని, విజయాన్ని అవహేళన చేస్తున్న అవాస్తవ ఆరోపణలపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ పిల్లల ప్రతిభ, కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని, నిరాధారమైన ఆరోపణలు వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు.

‘మాకు రూ. 3 కోట్లు ఎక్కడివి?’
గ్రూప్-1 పోస్టులను రూ. 3 కోట్లకు అమ్ముకుంటున్నారన్న కేటీఆర్(KTR) ఆరోపణలపై ఒక ర్యాంకర్ తండ్రి స్పందించారు. “మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాకు తెలియదు. అంత డబ్బు పెట్టి ఉద్యోగం కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. అంత డబ్బు ఉంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాం. మమ్మల్ని చూస్తే మూడు కోట్ల లంచం ఇచ్చే ఆర్థిక పరిస్థితిలో ఉన్నామని అనిపిస్తుందా? దయచేసి మమ్మల్ని, మా పిల్లలను అర్థం చేసుకోండి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టును కూడా అభ్యర్థిస్తున్నాం” అని ఆయన వాపోయారు.

మరొక తల్లిదండ్రులు మాట్లాడుతూ, “కొంతమంది రూ.3 కోట్లు ఇచ్చి పోస్టులు కొన్నారని ఆరోపిస్తున్నారు. మాలో కొందరికి పూట గడవడమే కష్టం. కష్టపడి, అప్పులు చేసి పిల్లల్ని చదివించాం. ఈ ఆరోపణలు నిరూపించకపోతే సమాజం మా పిల్లలను చిన్నచూపు చూస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చినా, ‘₹3 కోట్లు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం’ అని నలుగురూ అనుకుంటారు. మీ రాజకీయాలు, ఆరోపణలు నిరుద్యోగుల జీవితాలను నాశనం చేయవద్దు. మీరు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించండి” అని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment