రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ ఏబీవీ పదవికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఏబీ వెంకటేశ్వరరావు ఈ పదవిలో కొనసాగనున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరావు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిందన్న ఆరోపణలున్నాయి. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాల విషయంలో కేంద్ర జోక్యంతో గత ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను కూటమి సర్కార్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత సస్పెన్షన్ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని చంద్రబాబు సర్కార్ ఇటీవల ఆదేశాలిచ్చింది. తాజాగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.